ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

GSLV Mark 3 Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 బాహుబలి రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అక్టోబర్ 23వ తేదీ అర్ధరాత్రి 12:07 గంటలకు జీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.

జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శనివారం సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి ఆయనకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. ఈ రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగం. విదేశాలకు చెందిన ఉపగ్రహాలను భారత్ కక్ష్యల్లో ప్రవేశ పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించడంతో షార్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాధ్‌ రాకెట్‌ విజయవంతం అయిన అనంతరం ప్రసంగించారు. జీఎస్‌ఎల్‌వీ -మార్క్‌ 3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో పాటు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రయోగం విజయవంతానికి కృషిచేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like