ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి

కళాశాలల్లో సంప్రదించాల్సిన అవసరం లేదు

ఈ నెల 25 నుండి జిల్లాలో నిర్వహించబోయే ఇంటర్మీడియేట్ ప్రథమ సం. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్ బోర్డు వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి జన్మతేదీ మరియు పదవతరగతి రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థి కళాశాలకు వెళ్లకుండా ఏ ఇంటర్నెట్ కేంద్రం నుండైనా పొందవచ్చని, కళాశాలకు వెళ్లి హాల్ టికెట్ అడగకుండా విద్యార్థి నేరుగా హాల్ టికెట్ పొందవచ్చు. హాల్ టికెట్ పొందిన తర్వాత తమ పరీక్శా కేంద్రం, తేదీల వారీగా సబ్జెక్టులను పరిశీలించాలని అన్నారు. ఈ నెల 25 వ తేదీ నుండి నిర్వహించబోయే పరీక్షల్లో జనరల్ విద్యార్థులు 4326 మరియు 882 ఒకేషనల్ మొత్తం 5208 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష రాయబోయే విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించి , హాల్ టికెట్, సానిటైజర్ బాటిల్ తమ వెంట తీసుకు రావాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like