హ‌రీష్‌రావు ద‌మ్మేంటో… ఢిల్లీలో తెలిసింది క‌దా..

హ‌రీష్‌రావు ద‌మ్మెంటో నిజంగానే ఢిల్లీలో తెలిసిపోయింది. ఆయ‌న ఏది చేసినా అద్భుతంగానే ఉంటుంది. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం నిర్మించ‌డంలో, అంద‌రినీ క‌లుపుకుపోయి ప‌నిచేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఇది మ‌రోసారి నిరూపితం అయ్యింది.

సిద్దిపేట అభివృద్ధి పేట… ఆకుపచ్చ అవార్డుల్లో ఆదర్శ పేట అని మరో సారి భారతాన సిద్దిపేట పేరు మారు మోగింది… స్వచ్ సర్వేక్షన్ 2021 అవార్డును సిద్దిపేట పట్టణం కైవసం చేసుకుంది.. ఇప్ప‌టికే ఎన్నో అవార్డులు కైవ‌సం చేసుకున్న సిద్దిపేట పట్టణం తాజాగా ఈ అవార్డు కూడా త‌న ఖాతాలో వేసుకుంది. మంత్రి హరీష్ రావు స్పూర్తితో ఇప్పటికే పట్టణం లో పరిశుభ్రత, పచ్చదనం , తడి పొడి చెత్త సేకరణ ఎలా ఎన్నో అంశాల పై 17 రాష్ట్ర జాతీయ స్థాయి అవార్థులు సాధించింది. ఈ అవార్డుల విష‌యంలో మంత్రి హరీష్ రావు కృషి , ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. స్వచ్ సర్వేక్షణ్ లో జాతీయ స్థాయిలో మరో సారి ఎంపిక‌యింది..

● మూడు ప్రధాన అంశాల్లో.. 50 సూచికలు…

” స్వచ్ సర్వేక్షణ్‌ అవార్డుకు ఎంపిక కావడం లో ప్రధానంగా మూడు అంశాలు 50 సూచికలు రూపొందించారు. సేవా స్థాయి పురోగతి లో నాణ్యమైన చెత్త సేకరణ మూడు రకాలు తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణలో వాహనాల నిర్వహణ , వీటి ప్రక్రియ చెత్తను తొలగించడం , పారిశుద్ధ్య పని తీరు , సర్టిఫికెషన్ విధానం , ప్రజల భాగస్వామ్యం , చైతన్యం , స్వచ్ యాప్ ఉపయోగించడం, అవగాహన కార్యక్రమాలు చేయడం లో సిద్దిపేట మున్సిపాలిటీ అమోఘ‌మైన ప‌నితీరు క‌న‌బ‌రిచింది. ఈ అవార్థు రావ‌డానికి అవే ప్రధాన అంశాలుగా మారాయి.

స్వచ్ఛ‌త పై పాట , అవగాహన కార్యక్రమాలతో చైతన్యం ..!!

” సూర్య కిరణాల కాంతి వెలుగులో సిద్దిపేట మెరవాలి… చంద్రుడు సైతం సిద్దిపేట ను తొంగి చూడాలి… స్వచ్ఛత… స్వచ్ఛత సిద్దిపేట స్వచ్ఛత అని పాట పట్టణ ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చింది.. అది కూడా ప్ర‌జ‌ల్లో స్పూర్తి నింపింది. దేశంలోనే సిద్దిపేట పట్టణం పచ్చదనం పరిశుభ్రత లో ఎంత ఆదర్శంగా ఉందొ.. ప్రజల భాగస్వామ్యం, వారి చైతన్యం అవార్డ్ రావడం లో ఎంతో తోడ్పాటు అయింది…

20న ఢిల్లీ లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

స్వచ్ సర్వేక్షణ్‌లో సిద్దిపేట పట్టణం జాతీయ స్థాయిలో ఎంపిక కాగా ఈ నెల ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో అవార్డ్ ల ప్రధానం ఉంటుంది. ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిందిగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రమణాచారికి సందేశం ద్వారా ఆహ్వానం అందింది.. ఈ మేరకు 20న విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇద్దరు అవార్డ్ అందుకోనున్నారు..

ప్రజల భాగస్వామ్యం.. ఐక్యత కు గొప్ప నిదర్శనం – మంత్రి హరీష్ రావు ..

సిద్దిపేట పుర ప్రజల ఐక్యత..వారి భాగస్వామ్యం గొప్పది. అభివృద్ధి, అవార్డుల్లో వారు ఎంతో స్పూర్తిని చాటుకున్నారు. స్వచ్ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో అవార్డు కు ఎంపీక కావడం ఎంతో సంతోషం. సిద్దిపేట ప్రజలకు శుభాకాంక్షలు. వివిధ అంశాల్లో 17 అవార్డులు సాధించ‌డం, మరో జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం ప్రజల భాగస్వామ్యం , ప్రజాప్రతినిధులు చొరవ అధికారుల అంకిత భావమే.. ఏ కార్యక్రమం చెప్పినా, పిలుపు ఇచ్చినా ఎంతో చైతన్యం చూపారు. ఇదే స్ఫూర్తి తో పట్టణాన్ని మరింత అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవాలి. అందరి కృషి ఫలితంగా మరిన్ని అవార్డులు సాధించాలి.

మంత్రి హరీష్ రావు స్పూర్తి.. ప్రజల చైతన్యం – మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు..

అభివృద్ధిలో విష‌యంలో కానీ, ఏ కార్యక్రమం అయినా మంత్రి హరీశ్ రావు ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ఉంది. స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌లో మంత్రి సూచనలు స‌ల‌హాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఆయ‌న ఇచ్చిన‌ స్పూర్తి , ప్రజల భాగస్వామ్యం మున్సిపల్ అధికారులు పని తీరుకు నిదర్శనం.

సిద్దిపేట మునిసిపాలిటీ అవార్డు లు.. 18 అవార్డులు..

– 2012 – క్లీన్ సిటీ ఛాంపియన్ షిప్ అవార్డు – రాష్ట్ర స్థాయి.

– 2015 – ఎక్సలెన్స్ అవార్డు ( సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ ) – జాతీయ స్థాయి

– 2016 – ఎక్స్ లెన్స్ అవార్డు పారిశుద్ధ్య నిర్వహణ – జాతీయ స్థాయి

– 2016 – హరిత మిత్ర అవార్డ్ రాష్ట్ర స్థాయి

– 2016 స్కాచ్ అవార్డు చెత్త సేకరణ, 100% మరుగుదొడ్ల నిర్మాణం లో జాతీయ స్థాయి అవార్డ్

– 2016 ఒడిఫ్ సర్టిఫికెట్ జాతీయ స్థాయిలో …

– 2016 ఎక్స్ లెన్స్ అవార్డు రాష్ట్ర స్థాయిలో ..

– 2017 రాష్ట్రీయ స్వచ్ భారత్ పురస్కార్ జాతీయ స్థాయి

– 2017 బెస్ట్ మున్సిపాలిటీ అవార్డ్ సీఎం గారిచే రాష్ట్ర స్థాయి అవార్డు ..

– 2017 iso అవార్డు జాతీయ స్థాయి

– 2018 – సాలీడ్ మేనేజ్మెంట్ లో స్కాచ్ అవార్డ్ జాతీయ స్థాయి

– 2018 స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు జాతీయ స్థాయి

– 2018 స్కోచ్ అవార్డ్ 6 పద్ధతులు అమలు లో ఉన్నందున జాతీయ స్థాయి

– 2018 స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం..

– 2019 స్వచ్చత ఎక్స్ లెన్స్ అవార్డ్ జాతీయ స్థాయిలో

– 2019 స్వచ్ సర్వేక్షన్ అవార్డ్ జాతీయ స్థాయిలో …( దక్షిణ భారత దేశంలో రెండవ స్థానంలో )

– 2021 సిద్దిపేట పట్టణం లో 100% ఇంటింటికి స్వచ్చ మైన త్రాగు నీటి సరఫరా నిర్వహణ కు రెండు స్కాచ్ అవార్డ్ లు వచ్చాయ్..

– 2021 దేశ స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ అవార్డు కు ఎంపిక…

Get real time updates directly on you device, subscribe now.

You might also like