హస్తినకు తెలంగాణ‌ మంత్రుల బృందం..

ధాన్యం కొనగోళ్లపై స్పష్టతనివ్వాలని గులాబి దళం నేతలు హస్తినకు పయనమయ్యారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఢిల్లీలో కేంద్రంతో చర్చలు జరిపేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,పువ్వాడ‌ అజయ్ బృందం ఢిల్లీకి బయలు దేరింది. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు అర్ధరహితమన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలని, లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి బండి సంజయ్‌కు ఏం సంబంధమ‌న్నారు.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడిన అంటే స్పష్టమైన హామీతో మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా ? అని ఆయన ప్రశ్నించారు. పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కొంటున్నారో ఇక్కడ కూడా అదేవిధంగా కొనుగోలు చేయాలన్నారు. ఈ వడ్లనే కొంటాం ఆ వడ్లనే కొంటాం అంటే ఎలా అని అన్నారు. సీఎం కేసీఆర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదని హితవు పలికారు. ఈయన రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాడు, ఏం చేశాడో చెప్పాలన్నారు. ఇతని వలన రాష్ట్రానికి ఏం ఒరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like