హమాలీల ఆరోగ్యం ముఖ్యం

కోరమాండల్ రీజినల్ లాజిస్టిక్స్ మేనేజర్ V.V.N.శేషు కుమార్

కుటుంబం కోసం నిత్యం కష్టపడే హమాలీల ఆరోగ్యం ముఖ్యమని అందుకే వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కోరమాండల్ రీజినల్ లాజిస్టిక్స్ మేనేజర్ V.V.N.శేషు కుమార్ వెల్లడించారు. శుక్రవారం కోరమాండల్ లిమిటెడ్ ఎరువుల సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే గూడ్‌షెడ్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హమాలీలు వారి కుటుంబాల శ్రేయస్సు పట్ల శ్రద్ధ వహించడమే ఈ హెల్త్ క్యాంప్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ శిబిరంలో సాధారణ వైద్య చికిత్స, బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌, బ్లడ్‌ ప్రెజర్‌ పరీక్షలు నిర్వహించారు. చికిత్స అనంతరం మందులు, మాత్రలు ఉచితంగా అందించారు. 200 మంది హమాలీలు, లారీ యజమానులు,డ్రైవర్లు,చుట్టుపక్కల గ్రామస్తులు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. కార్య క్రమంలో డివిజనల్ HR సుధాకర్, కంపెనీ సీనియర్ జోనల్ మేనేజర్ సజన్ కుమార్, ఆవేజ్ మేనేజర్ శ్రీధర్, వరంగల్ మార్కెటింగ్ అధికారులు సుమన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరేష్, సీనియర్ ఆగ్రోనామిస్ట్ రామకృష్ణ, వెంకన్న డీలర్లు పాల్గొన్నారు. Dr.దినేష్ ఆధ్వర్యంలో ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like