క్లిక్‌మంటుంది… చ‌లాన్ వేస్తుంది..

-ఇకపై సీసీ కెమెరాల ఆటోమెటిక్‌ క్లిక్‌
-ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ విధానం అమలు
-ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలే
-రామ‌గుండం క‌మిష‌న‌ర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి

Henceforth automatic traffic challans through CC cameras: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు జరిమానాలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లోని సీసీ కెమెరాల పనితీరు అడ్మిన్ డీసీపీ అఖిల్ మహాజన్ తో కలిసి పరిశీలించారు. అనంతరం క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలోని సీసీ కెమెరాలు డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్ మెంట్ సిస్టం తో అనుసంధానం చేశామ‌న్నారు. వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంప్ చేసినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఆటోమెటిగ్గా సీసీ కెమెరాల ద్వారా ఈ చాలన్ ద్వారా జరిమానాలు పడతాయన్నారు. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్,ఏ ఆర్ ఏసీపీ సుందర్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ మధుకర్, ఇన్స్పెక్టర్ శ్రీధర్, కమ్యూనికేషన్ అండ్ ఐటీ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like