హోం శాఖ మంత్రి రోజా..

మంత్రి ప‌ద‌వి కూర్పు విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఎవ‌రికి ఏ శాఖ కేటాయించాలి..? ఏం చేయాలి అనే దానిపై కొద్ది రోజులుగా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.. కానీ రోజాకు మాత్రం ఆమె అభిమానులే ఏకంగా శాఖ‌నే కేటాయించారు. అభిమానుల అత్యుత్సాహం ర‌చ్చ‌ర‌చ్చ అవుతోంది. ఏకంగా వికీపీడియాలో ఎమ్మెల్యే రోజాకు హోంమంత్రి పదవి ఇచ్చినట్లుగా చూపిస్తోంది.. వీకీపీడియా చూస్తే రోజాకు హోంశాఖ వచ్చినట్లు ఆ పేజ్ వైరల్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వికీపీడియాలో ఎవరైనా మార్పులు చేసే అవకాశం ఉండటంతో కొంతమంది కావాలనే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. అలాగే కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోజాకు హోంమంత్రి పదవి ఇస్తే బావుటుందని చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా వికీపీడియా ద్వారా ఈ విష‌యం వెలుగులోకి రావ‌డంతో గంద‌ర‌గోళంగా మారింది.

వికీపీడియాలో రోజాకు హోంమంత్రి పదవి ఇచ్చారని ఎడిటింగ్. సోషల్ మీడియాలో కూడా హోం ఇస్తారని చర్చ. మంత్రి పదవి దక్కడంతో రోజా కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె హోదా మారడంతో జబర్ధస్త్‌, సినిమాల సంగతి ఏంటనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు.. జబర్ధస్త్‌తో పాటూ సినిమాలకు దూరంగా ఉంటానని తెలిపారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేనని రోజా భావోద్వేగానికి గురయ్యారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారని.. కానీ జగన్ తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. ఈ కేబినెట్‌లో మహిళా మంత్రిగా ఉండటం అదృష్టమని.. జగన్ చెప్పిన పని చెయ్యడమే తన విధి అన్నారు. తనను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారని.. కానీ ఇవాళ జగన్ మంత్రిగా చేశారని ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేస్తానని.. మంత్రి అయినందుకు షూటింగ్ లు మానేస్తున్నట్లు తెలిపారు. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చేయనని చెప్పేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like