హాస్ట‌ల్‌ విద్యార్థుల మందు పార్టీ

బీసీ హాస్ట‌ల్‌లో ఫేర్‌వేల్ పార్టీలో విద్యార్థులు మందు తెచ్చుకుని చిందేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు బ‌య‌టికి రావ‌డంతో అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఫేర్‌వేల్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో విద్యార్థులు బీరు, బిర్యాణి తెచ్చుకుని ఎంజాయ్ చేశారు. హాస్టల్ ను ఏకంగా బార్‌లాగా మార్చేశారు. ఇందులో ఇలా జ‌ర‌గ‌డం ఇది మొద‌టిసారి మాత్ర‌మే కాద‌ని, ఎన్నోసార్లు జ‌రిగింద‌ని ప‌లువురు చెబుతున్నారు. విద్యార్థులు బీరు తాగుతూ దిగిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో అధికారులు జరిగిన విషయం పై విచారణ ప్రారంబించారు. విచారణ కోసం అసిస్టెంట్ బిసి డెవల‌ప్‌మెంట్ అధికారిణి భాగ్యవతి హాస్టల్ తనిఖీ చేసి విచారణ ప్రారంభించారు. హాస్ట‌ల్ వార్డెన్‌, సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతోంద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like