స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన ట్రావెల్ బ‌స్సు

పాఠ‌శాల వ్యాన్‌ను వెన‌క నుంచి ఓ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో విద్యార్థుల‌కు గాయాల‌య్యాయి. ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు వేగంగా లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది.

మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌కు చెందిన సెంట్‌థెరిస్సా పాఠ‌శాల‌ విద్యార్థుల‌ను తీసుకువ‌చ్చేందుకు పాఠ‌శాల వ్యాన్ వ‌చ్చింది. సెంట‌ర్ నుంచి విద్యార్థుల‌ను ఎక్కించుకుని వ‌స్తున్న వ్యాన్ పోస్టాఫీస్ దాట‌గానే విద్యార్థుల కోసం డ్రైవ‌ర్ ఆపాడు. దీంతో వెన‌కాలే వ‌స్తున్న ట్రావెల్ బ‌స్సు దీనిని గ‌మ‌నించ‌కుండా ముందుకు తీసుకువెళ్లాడు.

వ్యాన్‌ను వెన‌క నుంచి ఢీకొట్ట‌డంతో అద్దాలు ప‌గిలి విద్యార్థుల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. కొంద‌రు విద్యార్థులు సీట్ల‌కు తాక‌డంతో వారికి సైతం గాయాల‌య్యాయి. బ‌స్సు వేగంగా లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని గ్రామ‌స్తులు వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like