మానవ మృగాలు..

Gang Rape: న‌లుగురు వ్య‌క్తులు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేయ‌డంతో ఆ బాలిక మృతి చెందింది. ఈ ఘ‌ట‌న రెండు రోజుల కింద‌ట జ‌ర‌గ్గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో చోటుచేసుకున్న ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి… మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం అప్ప‌న్న‌పేట‌కు కూలీలుగా వ‌ల‌స వ‌చ్చారు. ఆ కుటుంబానికి చెందిన 16 ఏండ్ల మైనర్ బాలిక పై కొంద‌రు దుండ‌గుల క‌న్ను ప‌డింది. నలుగురు వ్యక్తులు రెండు రోజుల కింద‌ట‌ రాత్రి పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాలికను ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో ప‌డ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like