నేను పార్టీ మార‌డం అవాస్తం

- మీకు అధికారమే ముఖ్యం
- ధాన్యం డబ్బులు అడుగుతే దాడులా?
- బీఆర్ఎస్ దాడిలో గాయపడ్డ రైతును కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది
- మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

Prem Sagar Rao: తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి మారుతున్నానని జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యర్ధులు తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారానికి తెర తీశారని విమర్శించారు. కాంగ్రెస్ విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రభుత్వంలో తనకు సముచితస్థానం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దయచేసి ఎవరు ప్రత్యర్థుల ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

బీఆర్ఎస్ నాయకులకు అధికారమే ముఖ్యం కానీ ప్రజాసంక్షేమంపై శ్రద్ధ లేదని ప్రేమ్ సాగర్ రావు దుయ్య‌బ‌ట్టారు. ఆదివారం ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు కొడుకు ప్ర‌చారం చేస్తున్న సంద‌ర్భంలో త‌న స‌మ‌స్య‌లు వివ‌రించిన రైతుపై బీఆర్ఎస్ నేత దాడి చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతు జంగిలి ముత్తయ్య తనకు 47 ధాన్యం బస్తాలు కోత విధించారని వారి దృష్టికి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం ఆటవిక చర్య అన్నారు. రైతు గాయపడి రక్తం కారుతున్నా కానీ ఎమ్మెల్యే తనయుడు ప‌ట్టించుకోక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.

ప‌ట్టించుకోక‌పోగా, పక్క ఇంట్లో ప్రచారం చేయడం ఏమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ను గుండా గా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే గ్రూప్ వారే ప్రత్యక్ష గుండాయిజానికి దిగడం ప్రజలు గమనిస్తున్నారని ప్రేంసాగ‌ర్ రావు దుయ్య‌బ‌ట్టారు. గాయపడ్డ రైతు వైద్య ఖర్చులు కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని స్ప‌ష్‌టం చేశారు. జిల్లాలో ఇంకా చాలా మంది రైతులకు ధాన్యం డబ్బులు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చి రైతుల సమస్యలు తీరుస్తామన్నారు. ఓ పక్క రైతు బంధు ఇస్తూనే అంతకు మించి రైతుల‌కు నష్టం చేస్తున్నార‌ని అన్నారు. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like