ఇచ్చోడలో మత్తు ఇంజెక్షన్ కలకలం

Ichodalo anesthetic injection disorder: ఇచ్చోడ మండ‌లంలో మ‌త్తు ఇంజెక్ష‌న్ క‌ల‌క‌లం సృష్టించింది. మండ‌లంలోని హరినాయక్ తండా బస్టాండ్ వ‌ద్ద నిల్చుని ఉన్న శ్రీకాంత్ (22) అనే యువకుడికి ఇంజెక్షన్ పొడిచిన ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌రార‌య్యారు. ద్విచక్ర వాహనంపై వచ్చి వారు ఇంజెక్షన్ పొడిచి వెల్లిపోయారు. ఆ ఇంజెక్షన్ ప్రభావంతో శ్రీ‌కాంత్ తీవ్ర అస్వస్థతకు గుర‌య్యాడు. అచేతనంగా పడి ఉన్న యువకుడిని చూసి స్థానికులు 108 కు సమాచారమిచ్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన 108 సిబ్బంది వెంట‌నే శ్రీ‌కాంత్ ను రిమ్స్ కు తరలించారు. ఆ యువ‌కుడు రిమ్స్ లో కోలుకుంటున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారనే వార్త ఆ నోట ఈ నోట ప్రచారం కావడంతో స్థానిక ప్ర‌జ‌లు భయాందోళనకు గుర‌వుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like