ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఇద్దరు మ‌హిళ‌ల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇద్దరు మ‌హిళ‌లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అవుతోంది. కొద్ది రోజుల కింద‌ట‌ ఆ ఇళ్లలో కొంత మంది బలవంతంగా తాళాలు పగల గొట్టి అందులోకి వెళ్లారు. దీంతో పోలీసులు, హౌసింగ్ అధికారులు వీరికి కౌన్సిలింగ్ నిర్వహించారు. లాటరీ ద్వారా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ముందు మీరు ఇల్లు ఖాళీ చేయాలని స్ప‌ష్టం చేశారు. వారికి వారం రోజులు గడువు ఇచ్చారు. అయినా ఖాళీ చేయడం పోవడంతో కొందరు వేధింపుల‌కు గురి చేశార‌ని, అందుకే షేక్ అయేషా, షేక్ ఆఫ్రీన్ అనే ఇద్దరు మహిళలు గోద్రెజ్ త్రాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వేధింపులు స్థానిక ప్రజాప్రతినిధుల దౌర్జన్యం మూలంగా మనస్థాపనికి గుర‌య్యాని, అందుకే ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత మహిళ లకు వైద్యం అందిస్తున్నారు..

Get real time updates directly on you device, subscribe now.

You might also like