ఇదే స్ఫూర్తితో పని చేయండి

జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఇదే ఉత్సాహం, స్పూర్తితో పని చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డులకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డులకు 21 పాఠశాలలు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ అవార్డుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన సర్వేలో పాఠశాలల్లో విద్యార్థినీ,విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత, ఆరోగ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల వినియోగం, సత్ప్రవర్తన, సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై ఉత్తమ ప్రతిభ ఉన్న పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 21 పాఠశాలలు ఎంపిక అయ్యాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఇలాంటి మరిన్ని అవార్డులకు ఎంపికయ్యేలా కృషి చేయాలని తెలిపారు. కలెక్టర్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు ప్రధానోపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సెక్టోరల్ అధికారి చౌదరి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like