ఇదేం జ‌ర్న‌లిజం..

మ‌ల్ల‌న్న పోల్‌పై మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ‘పోల్’ పేరిట మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ”బాడీ షేమింగ్” కు పాల్పడడం దుర్మార్గమైనదని మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని స్ప‌ష్టం చేశారు. యూట్యూబ్ ఛానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనదని అన్నారు. దీనిని ఎవరూ అంగీకరించరని స్ప‌ష్టం చేశారు. జర్నలిస్టుల పేరిట, పత్రికా స్వేచ్ఛ పేరిట వాడుతున్న భాష రాజకీయ విధానాల మీద కాకుండా కుటుంబ సభ్యులను వివాదాలకు లాగుతున్న ప్రయత్నాలను తాను ఖండిస్తున్నానని స్ప‌ష్టం చేశారు. ఇది జర్నలిజం కాదని, ఈ భాష జర్నలిస్టులు వాడదగినది కాదని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. పత్రికా స్వేచ్ఛ పేరిట ఇదొక అన్యాయమైన అప్రజాస్వామిక చర్య అని దుయ్య‌బ‌ట్టారు. యూట్యూబ్ ఛానళ్ల పేరిట సోషల్ మీడియాలో చలామణి అవుతున్న చాలామంది ప్రాథమికంగా జర్నలిస్టులు కాదన్నారు. ఇది ఒక విద్వేష పూరితమైన ప్రాయోజిత ప్రచారంలో భాగంగానే జరుగుతుందన్నారు.

విలువ‌ల‌కు పూర్తిగా విరుద్ధం : టీయూడబ్ల్యుజే హెచ్ 143
జర్నలిజం పేరిట రాజకీయ నాయకుల కుటుంబాలను వీధిలోకి లాగడం సరియైనది కాదని తెలంగాణ యూనియ‌న్ ఆఫ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టు యూనియ‌న్ హెచ్ 143 స్ప‌ష్టం చేసింది. ఆ యూనియ‌న్ అధ్య‌క్షుడు అల్లం నారాయ‌ణ‌, ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్, మారుతీసాగ‌ర్‌, ర‌మ‌ణ‌కుమార్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తీన్మార్ మల్లన్న మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు బాడి షేమింగ్ చేస్తూ పోల్ నిర్వహించడం అప్రజాస్వామికమ‌న్నారు. ఇది జర్నలిజం విలువలకు పూర్తిగా విరుద్ధమైంద‌న్నారు. ఇది పత్రికా స్వేచ్ఛ దుర్వినియోగం చేయడంగా భావిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. జర్నలిస్టులు అంద‌రూ ఈ భాషకు దూరంగా ఉండాలన్నారు. విలువలకు కట్టుబడి ఉండాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ భావిస్తున్నదని వెల్ల‌డించారు. కేటీఆర్ కుమారుడిని వివాదంలోకి లాగడాన్ని ఖండిస్తున్నామ‌ని వారు స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like