నాకు పిచ్చిలేస్తే కాల్చిపడేస్తా

కాంగ్రెస్ నేతలకు మర్రి జనార్ధన్ రెడ్డి వార్నింగ్

నాతో పెట్టుకొంటే కాల్చి పడేస్తానని కాంగ్రెస్ నేతలకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో ఆయన కాంగ్రెస్ నేతలపై తిట్ల పురాణం అందుకున్నారు. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నా సంగతి మీకు తెలియదంటూ ఫైర్ అయ్యారు. తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ నేతలను కాల్చిపడేస్తానని వ్యాఖ్యానించారు. తనతో పెట్టుకొంటే మీకే నష్టమని వారికి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు తనను రెచ్చగొడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. తన కేడర్ కు చెబితే కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ కూడ గ్రామాల్లో తిరగనివ్వరని మర్రి జనార్థన్ రెడ్డి చెప్పారు. ఆయ‌న రెండు రోజులుగా పాద‌యాత్ర చేస్తున్నారు. తెలకపల్లి మండలం బొప్పల్లిలో పాదయాత్ర చేరిన సందర్భంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రసంగించారు. ఈ సభలో కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తనతో పెట్టుకోవద్దని కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రసంగిస్తూ తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ నేతలను కాల్చిపడేస్తానని చేసిన వ్యాఖ్య‌లు కలకలం రేపుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like