ప్రారంభ‌మైన‌ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ఆరోగ్య శిబిరం

Inaugurated Lifeline Express Health Camp: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని బుధవారం ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప ప్రారంభించారు. ఫ్లాట్ ఫాం నంబర్-4లో ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఇంపాక్ట్ ఇండియా ఆధ్వర్యంలో లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. భారత్ పెట్రో లియం స‌హాయ‌,సహ‌కారాల‌తో ఇది కొన‌సాగుతోంది. ఈ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ రైలులోనే శస్త్ర చికిత్సలు చేయ డానికి అన్ని ఏర్పాట్లు సైతం ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మధ్యప్ర దేశ్, గుజరాత్, మహారాష్ట్ర, న్యూ ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి అనుభవజ్ఞులైన వైద్యులతో శస్త్ర చికిత్సలు, వైద్య సేవలు అందించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 22 మంది వైద్యులు హాజరయ్యారు. ఓపీ నిర్వహ ణకు రైల్వేస్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరానికి హాజరు కాలేని వారు ఒకే ప్రాంతంలో కనీసం 20 మంది ఉంటే వారి కోసం వాహనం సైతం ఏర్పాటు చేశారు. బుధ‌వారం నుంచి నవంబర్ 2 వరకు ఈ ఉచిత వైద్య శిబిరం కొనసాగ‌నుంది.

ఈ నెల 18 వరకు ఓపీతో పాటు కంటి పరీ క్షలు, శస్త్ర చికిత్సలు, 19 నుంచి 22 వరకు ఓపీతో పాటు పెదవి చీలికలు, కాలిన గాయాలకు సర్జరీ, 14 ఏళ్ల లోపు పిల్లలకు ఎముకల సర్జరీ నిర్వ‌హిస్తారు. ఈ నెల 27 నుంచి 31 వరకు చెవి సంబంధీత పరీక్షలు, శస్త్ర చికిత్సలు, 28 నుంచి నవంబర్ 2 వరకు దంత సంబంధిత పరీక్షలు, వైద్యం అందించనున్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు రొమ్ము, గర్భ సంబంధిత క్యాన్సర్లపై అవగా హన, పరీక్షలు ఉంటాయని శిబిరం నిర్వాహకులు స్పష్టం చేశారు. లైఫ్లైన్ ఎక్స్ ప్రెస్ రైలులో అన్ని శస్త్ర చికిత్సలకు సంబం ధించిన పరికరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వ హిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like