ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో స‌రికొత్త చ‌రిత్ర‌

యుద్ద విమానం న‌డిపిన తండ్రి, కూతుళ్లు

అది క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బీద‌ర్ ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌.. హాక్ 132 ర‌కానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ రివ్వున గాల్లోకి లేచింది. ఆ యుద్ద విమానం ఒక చ‌రిత్ర‌కు సాక్ష్యం ప‌లుకుతూ ముందుకు సాగింది.

ఆ విమానాన్ని న‌డుపుతోంది ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ, ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ. వీరిద్ద‌రూ క‌లిసి ఆ విమానాన్ని న‌డిపించారు. వీరిద్ద‌రూ తండ్రి, కూతుళ్లు కావ‌డం గ‌మ‌నార్హం. ఓ మిషన్ కోసం ఇలా తండ్రి, కుమార్తె ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించడం ఇదే తొలి సారి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ అరుదైన సంఘటనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి సంజ‌య్ తో క‌లిసి ఒకే యుద్ధ విమానంలో ప్రయాణించడంతో త‌న క‌ల సాకారం అయ్యింద‌ని అనన్య వెల్ల‌డించారు. తండ్రీకూతురు కలిసి యుద్ధ విమానం ముందు దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

తండ్రి భార‌త వైమానిక ద‌ళంలో చేరడంతో ఆయ‌న‌ను స్ఫూర్తిగా తీసుకుని తానూ సైన్యంలో చేరి దేశానికి సేవలందించాలని నిశ్చయించుకుంది అన‌న్య శ‌ర్మ‌. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ పూర్తి చేసింది. వైమానిక దళం మొదటి మహిళా ఫైటర్ పైలట్ల బృందం (2016)లో చోటు దక్కించుకుంది. అనంతరం ఫ్లయింగ్ బ్రాంచ్ శిక్షణ తీసుకుంది. కఠిన శిక్షణ పొంది గతేడాది డిసెంబర్లో ఫైటర్ పైలట్గా చేరింది. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన అనన్య శర్మ తన తండ్రి కూడా గర్వపడేలా సాధించిందని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like