ఫ్లాష్.. ఫ్లాష్.. ఇంటర్ ఫలితాల తేదీ వచ్చింది

కొద్ది రోజులుగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. రిజల్ట్స్ ఇవ్వాళ, రేపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎట్టకేలకు ఫలితాల తేదీని విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. జూన్ 28న ఉదయం 11 గంటలకి ఫలితాలు విడుదల కానున్నాయి.

కొద్ది రోజులుగా తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతోంది. మొదట 22 తేదీన ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన చెప్పిన అధికారులు ఆలస్యం అవుతుందని ప్రకటించారు. మొదట అంతా పూర్తి అయ్యిందని భావించారు. కానీ కంప్యూటర్ లో నమోదు చేసే సమయంలో కొన్ని పొరపాట్లు గురించారు. మూల్యాంకన ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిశీలించారు. అంతా ఒకే కావడంతో ఎల్లుండి రిజల్ట్స్ విడుదల కానున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like