జాతిని చీల్చే కుట్ర‌ల‌ను ఖండిద్దాం

-ఎన్నో త్యాగాలు.. పోరాటాల ద్వారా స్వాతంత్య్రం సిద్ధించింది
-స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌

జాతిని చీల్చేందుకు చేసే కుట్రలను, చిల్లర చేష్టలను మనమంతా ఖండించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు హెచ్‌ఐసీసీలో సోమవారం ప్రారంభమయ్యాయి. మొదట సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగుర వేసి, జెండావందనం చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అలాంటి ప్రయత్నాలు ఎక్కడ జరిన మనమంతా సమిష్టిగా ఖండించాలని కోరారు.

మహాత్మగాంధీని కించపరిచేలా జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే బాధవేస్తుందన్నారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను మలినం చేసుకోదని చెప్పారు. మహాత్ముడు ఏనాటికైనా మహాత్మునిగానే ఉంటారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు ఆనాడు పెద్దలు ఎంతో కష్టపడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వందలాది మంది సంస్థానాల అధిపతులను ఒప్పించారని.. రాజభరణాలు ఇచ్చారని తెలిపారు. 1947 ఆగస్టు 15 తర్వాత ఒక్కోక్కటిగా జమ్ము కశ్మీర్, జునాగఢ్, ఇండోర్, హైదరాబాద్, గోవా, పాండిచ్చేరిలు, సిక్కింలు.. దేశంలో విలీనమయ్యామని చెప్పారు.

ఏ దేశానికైనా స్వేచ్ఛా, స్వాతంత్య్రం అనేది అపూరూప సందర్భం అన్నారు. ఉద్యమ కారులను బ్రిటీష్ ప్రబుత్వం దారుణంగా అణచివేసిందని గుర్తుచేశారు. స్వయం పాలనలో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు. కొత్తతరం వారికి స్వాతంత్య్ర పోరాట త్యాగాల గురించి తెలియవని.. వాటిని ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్తతరం వారికి చెప్ప‌డం, పాత తరం వారి కర్తవ్యం అన్నారు. ఒకటిన్నర శతాబ్దం పాటు భారత స్వాతంత్య్ర పోరాటం సుదీర్ఘంగా సాగిందన్నారు. గాంధీజీ గురించి ఒబామా, మార్టిన్ లూథర్ కింగ్, ఐన్‌స్టీన్‌, నెల్సన్ మండేలా చెప్పిన గొప్ప మాటలను గుర్తుచేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like