జ‌గ‌న్ కంటే వెన‌క ప‌డ్డ కేసీఆర్

హైద‌రాబాద్ – ఏ విష‌యంలోనైనా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు నాన్చ‌డం అల‌వాటు. అదే స‌మ‌యంలో ఫ‌టాఫ‌ట్ తేల్చేయ‌డం ఆంధ్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అల‌వాటు. ఏ విష‌యంలోనూ ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌లో తేడా ఇదే. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడిలో కూడా ఇదే స్ప‌ష్టం అయ్యింది. ఆంధ్ర‌, తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు.. ఆంధప్రదేశ్‌లో 9 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 26వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఇక డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. తెలంగాణలోని 9 జిల్లాల్లో 12 స్థానాలకు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి చొప్పున.. ఆదిలాబాద్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి (ఎస్సీ-వరంగల్), సిరికొండ మధుసూదనచారి (బీసీ-వరంగల్), తక్కళ్లపల్లి రవీందర్‌రావు (ఓసీ-వరంగల్), ఎల్‌.రమణ (బీసీ-కరీంనగర్), ఎంసీ కోటిరెడ్డి (ఓసీ-నల్గొండ), పాడి కౌశిక్‌ రెడ్డి (ఓసీ-కరీంనగర్) పేర్లను ఖరారు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇక గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి (ఓసీ-నల్గొండ) పేరును ఫైనల్ చేశారని చెబుతున్నా.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మ‌ధ్య‌లో ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవ‌కాశం కూడా లేక‌పోలేద‌ని ప‌లువురు చెబుతున్నారు.

దీనికి విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. అధికారికంగా వారి పేర్లు బుధ‌వారం విడుద‌ల చేశారు. ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు ముగ్గురి పేర్లు ఖరారు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీకాకుళం వైకాపా నేత పాలవలస విక్రాంత్‌, కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఇషాక్‌ బాషా , కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్ల‌ను ఖ‌రారు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like