జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌కు సిద్దంగా ఉండండి

-రాజ‌కీయ జోక్యంతోనే కార్మికుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు
-తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి

మంచిర్యాల : జాతీయ సంఘాలు కార్మికుల‌ను త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్నాయ‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. శ‌నివారం మంద‌మ‌ర్రి ఏరియా కే.కే.5 గనిపై నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జాతీయ కార్మిక సంఘాల వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. కేంద్రం కార్మిక వ్య‌తిరేక విధానాలు అవ‌లంభిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ‌లోని నాలుగు బొగ్గు బ్లాక్‌ల‌ను వేలం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అడ్డుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్న జాతీయ సంఘాల వైఖ‌రిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలిపారు. ముందుముందు జరగబోయే పరిమాణాల‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాలని మిర్యాల రాజిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

సింగ‌రేణిలో రాజ‌కీయ జోక్యం గురించి ఆయ‌న మాట్లాడుతూ రాజకీయ జోక్యం వల్లనే 3,500 డిపెండెంట్లకు ఉద్యోగాల దగ్గరి నుండి అనేక కార్మిక సంక్షేమ ప‌థ‌కాలు త్వరగా అమలవుతున్నవని గుర్తుచేశారు. కార్య‌క్ర‌మంలో మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ అధ్యక్షతన జ‌రిగిన స‌మావేశంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికెల సంపత్ కుమార్, సీనియర్ నాయకులు జె.రవీందర్,పిట్ సెక్రెటరీ జీడి బాపు, బెలంపెల్లి రీజనల్ సెక్రెటరీ ఓ.రాజశేఖర్, GM కమిటీ స‌భ్యుడు.లక్ష్మణ్,మిట్ట సూర్యనారాయణ పవన్కుమార్, ఆర్‌కే ఓసీ పిట్ సెక్ర‌ట‌రీ రాజకుమార్, కేకే ఓసీ పిట్ యుగేందర్, కేకే 1 పిట్ సెక్ర‌ట‌రీ బిల్లా మాధవ రెడ్డి, సివిల్ పిట్ సెక్ర‌ట‌రీ తిరుపతి,ఎస్అండ్‌పీసీ పిట్ సెక్ర‌ట‌రీ రాజన్న,ఈశ్వర్, పేండ్రిరాజిరెడ్డి, సుదర్శన్, సీపెల్లి రాయలింగు,విక్రమ్ సింగ్, Gరాంచందర్, సాతినిరాజేందర్, మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి,బోడ్డు మల్లేష్,CH రవి యాదవ్, పెండంక్రిష్ణ సాయి,నాగరాజు,మోత్కూరు రాజేందర్,తేజ రెడ్డి,పోలు సంపత్,హర్ష, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్, పేండం రాజేష్,వినోద్, శాంతి కుమార్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like