జాతరకు వెళ్లకుండా మొక్కు చెల్లించుకోవచ్చు

హైద‌రాబాద్ : మేడారం జాత‌ర‌కు వెళ్లాలి… మొక్కులు చెల్లించుకోవాల‌ని ప్ర‌తి భ‌క్తుడికి ఉంటుంది… కానీ ఆ ర‌ద్దీలో వెళ్లాంటే భ‌యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. పిల్లా, పాప‌లు, వృద్ధుల‌ను తీసుకువెళ్లాలంటే మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌దు. ఈ ఇబ్బందుల‌ను దూరం చేసేందుకు ఆర్టీసీ కొత్త ఉపాయం ఆలోచించింది. జాత‌ర‌కు వెళ్ల‌కుండానే అమ్మ‌వారికి బంగారం స‌మ‌ర్పించుకునే స‌దుపాయం క‌ల్పిస్తోంది.

తెలంగాణ ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసి లాభాల బాట పట్టించేందుకు ఎండీ సజ్జనార్ అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఎప్పటికప్పుడు వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని కొత్త పుంత‌లు తొక్కిస్తున్న ఆయ‌న పండగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో సరికొత్త సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మేడారం జాతరకు వెళ్లేవారి కోసం 3,845 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ.. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే మేడారం జాతరకు వెళ్లలేని వారు సైతం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు తీర్చుకునేందుకు కార్గో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. త‌మ ఊళ్ల‌లో నిలువెత్తు బంగారం జోకిన త‌ర్వాత వాటిని ఆర్టీసీ కార్గోకు అప్ప‌గిస్తే దానిని అమ్మ‌వార్ల వ‌ద్ద‌కు చేరుస్తారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండానే మొక్కు చెల్లించుకోవ‌చ్చు. తమ కార్గో సర్వీస్ ద్వారా మొక్కలు చెల్లించిన‌ భక్తులకు అమ్మవార్ల పసుపు, కుంకుమ అందజేస్తామని సజ్జనార్ వెల్లడించారు.

ఈ విషయాన్ని తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసిన సజ్జనార్.. శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబు, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాన్ని వాడేశారు. ‘భగవంతునికి భక్తునికి అనుసంధానమైన టీఎస్ఆర్టీసీ ద్వారా మేడారంలో సమక్క-సారక్క అమ్మవార్లకు మొక్కులను చెల్లించుకోండి. చింత ఎందుకు దండగ టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ఉండగా’ అంటూ ట్వీట్‌ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like