జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది

-అమలు కోసం ప‌క‌డ్బందీ చర్యలు
-టీయూడబ్ల్యుజే ప్రతినిధి బృందంతో మంత్రి హరీష్ రావు

జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఇహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని ప‌క‌డ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం అరణ్య భవన్ లో మంత్రితో సమావేశమై హెల్త్ కార్డుల సమస్యపై వినతి పత్రాన్ని అందించింది.

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు తిరస్కరణకు గురువుతున్నాయ‌ని, దీంతో జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందుల‌ను ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈహెచ్ఎస్ అమలుకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం అమలును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీయుడబ్ల్యుజె ప్రతినిధి బృందం మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపింది. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, కార్యదర్శి ఫైసల్ అహ్మద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, హెచ్.యు.జే కార్యదర్శి శిగా శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, టీయూడబ్ల్యుజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

జర్నలిస్టు ఆపదపై స్పందించిన మంత్రి
ఆపదలో ఉన్న ఓ పాత్రికేయుడికి మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. బషీర్ బాగ్ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయుడు పుండరీ చారీ సతీమణి వినోద నాలుగు రోజుల కింద‌ట‌ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చేరింది. ఆయితే ఆశించిన స్థాయిలో ఆమెకు చికిత్స జరగడం లేదనే విషయాన్ని టీయూడబ్ల్యుజే ప్రతినిధి బృందం మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే స్పందిస్తూ వినోదకు ఏ.ఎం.సిలో బెడ్ కేటాయించి, మెరుగైన చికిత్స అందించాలని ఉస్మానియా సూపరిండెంట్ ను ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like