జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

-టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు గణపురం మహేష్
-కలెక్టరేట్ ఎదుట ధర్నా, వినతి పత్రం అందజేత

Journalists should be granted houses: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గణపురం మహేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ రావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంత‌రం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జర్నలిస్టులకు ఇళ్ల సలాలు మంజూరు చేయలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనివల్ల అనేక మంది పేద జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జర్నలిస్టులకు ఇస్తున్న బస్సు పాస్ కూడా పూర్తిస్థాయిలో వర్తించడం లేదన్నారు. రైల్వేపాస్, బస్పాస్ 100 శాతం రాయితీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఆర్టీసీ బస్సు రాయితీ వర్తింపచేయాలన్నారు. జర్నలిస్టులకు “జర్నలిస్ట్ బంద్ పథకం” ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. టోల్ గేటు ఫీజ్ నుండి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. రద్దు చేసిన రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చిన్న పత్రికలకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, ప్రభుత్వం ఇస్తున్న వ్యాపార ప్రకటనల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నీలి సతీష్, ఉపాధ్యక్షుడు ప్రకాష్, ట్రెజరర్ కృష్ణ మోహన్ గౌడ్, సభ్యులు శ్రీకాంత్, అవినాష్, కె. వేణుగోపాల్, విష్ణు గౌడ్, ఎండి ఇసాక్, విష్ణు, లలిత్ కుమార్, శ్రీనివాస్, మీర్జా జలీల్, బాల శ్రీనివాస్, నాగేందర్, బాలాజీ, రవి, రాజేశ్వర్, శ్రీధర్, జానకిరామ్, ఐజేయు నాయకులు అడప సతీష్, బిక్కాజీ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like