బ్రేకింగ్‌: జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు గ్రీన్‌ సిగ్నల్‌..

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ర్యాలీకి పోలీసులు ఎట్ట‌కేల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను రెండు రోజుల కింద‌ట‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఈ రోజు సికింద్రాబాద్‌లోని మహ్మత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు విచ్చేశారు.

దీంతో ఆయనను అడ్డుకునేందుకు, ర్యాలీకి అనుమతులు లేవని జాయింగ్‌ సీపీ కార్తికేయ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు కరోనా ఆంక్షల జీవోను తీసుకొచ్చారు. ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన నడ్డాకు జాయింట్‌ సీపీ కార్తికేయ కోవిడ్‌ నిబంధనల జీవోను వివరించి ర్యాలీకి అనుమతులు లేవని వివరించారు. కరోనా నిబంధనలతోనే ర్యాలీ నిర్వహిస్తామని, నా ప్రజాస్వామ్య హక్కు ఎవరూ అడ్డుకోలేరని జేపీ నడ్డా అన్నారు. అయితే నడ్డాతో చర్చలు జరిపిన పోలీసులు చివరికి ర్యాలీకి అనుమతులు ఇచ్చారు. అయితే కరోనా ఆంక్షలు పాటించాలని పోలీసులు సూచించారు. దీంతో కాసేపట్లో బీజేపీ ర్యాలీ సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్‌ సర్కిల్‌ వరకు జరగనుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like