కాంగ్రెస్‌తోనే పేద‌ల‌కు న్యాయం

Prem Sagar Rao{ కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల హ‌మాలీవాడ నుంచి ప‌లువురు కాంగ్రెస్లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనతో ప్ర‌జ‌లు విసిగిపోయారన్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదన్నారు.

చదువుకున్న మేధావులు, యువత మౌనం వీడాల‌న్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కౌన్సిలర్, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్, OBC సెల్ జిల్లా చైర్మన్ వడ్డే రాజమొగిలి, పట్టణ ఉపాధ్యక్షుడు జోగుల సదానందం, సరస్వతి, బుద్దార్థి శంకర్, అజయ్, ప్రకాష్, ఖదీర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన వారికి ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like