కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

ఏఐటీయూసీ ఆధ్వ‌ర్యంలో గ‌ని మేనేజ‌ర్‌కు విన‌తిప‌త్రం

మంచిర్యాల : ఏఐటీయూసీ ఆధ్వ‌ర్యంలో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై కొద్ది రోజులుగా ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లు స‌మ‌స్య‌ల‌పై కేకే1 మేనేజ‌ర్‌కు మంగ‌ళ‌వారం విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ ఎన్నో స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి నోచుకోకుండా కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 190 మస్టర్లు నిండిన బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దార్ ఇవ్వాలని కోరారు. అదే స‌మ‌యంలో సర్ఫేస్ మూర్ పోస్టులకు అన్ని క్యాటగిరి వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. క్వార్ట‌ర్లు లేని వారికి హెచ్.ఆర్.ఏ. కట్టి ఇవ్వాలన్నారు.

సింగరేణిలో 850 క్లరికల్ (జూనియర్ అసిస్టెంట్) పోస్టులకు 150 ఇన్స్టర్నల్ పోస్టులు ఖాళీలు నింపడం కాకుండా, 850 పోస్టులకు ఇన్స్టర్నల్ వారిచే ఖాళీలు భర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు. కోల్ఇండియా తరహాలో కొత్తగా అపాయింట్ అయిన వారికి బదిలి వర్కర్ కాకుండా, జనరల్ మజ్దార్ గా అపాయింట్ చేయాలని కోరారు. సొంత‌ ఇంటి పథకం కింద‌ మిగులు క్వార్ట‌ర్లు కేటాయించాలని లేక‌పోతే 300 గజాల స్థలం ఇచ్చి రూ. 20,00,000/- వ‌ర‌కు రుణ సౌకర్యము కల్పించాలని డిమాండ్ చేశారు. కార్య‌క్ర‌మంలో బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, కేకే 1 పిట్ సెక్రెటరీ వెళ్లి ప్రభాకర్, సుదర్శన్ దేవులపల్లి. శ్రీనివాసు, కంది శ్రీనివాసు, గడ్డం సంతోష్, ఆంథోని దినేష్చ‌ కుమారస్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like