కార్మికుల‌కు స‌రైన వైద్యం అందించండి

-ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాలి
-బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రి స‌మ‌స్య‌ల‌పై HMS విన‌తిప‌త్రం

బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రిలో ఎన్నో స‌మ‌స్య‌లు రాజ్య‌మేలుతున్నాయని, వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని HMS యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యాధికారి శౌరీకి విన‌తిప‌త్రం అందించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ ఆసుప‌త్రిలో ఆరోగ్య సిబ్బంది త‌క్కువ‌గా ఉన్నార‌ని IED ప్రకారం నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ లో కొత్తగా వచ్చిన వార్డ్ బాయ్స్కు 3 షిప్టులలో పని చేసే అవకాశం కల్పించలాని కోరారు. బెల్లంపల్లి ఏరియా గోలేటిలో కార్మిక కుటుంబాలకు మందులు స‌రిగ్గా అందుబాటులో ఉండ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సూదిమందు, గోళీలు అందుబాటులోకి తీసుకరావాల‌ని డిమాండ్ చేశారు.

బెల్లంపల్లి ఏరియాకు కొత్తగా వచ్చిన వార్డుబాయ్స్ అందరికి ప్లేడేలు కల్పించాలన్నారు. హాస్పిటల్ చిట్టీలు రాయ‌డానికి క‌నీసం క్లర్కులు కూడా లేర‌న్నారు. గోలేటి హాస్పిటల్ లో వెంట‌నే స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని కోరారు. బెల్లంపల్లి ఏరియా ఆసుప‌త్రిలో స్టాఫ్ లేక కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణిలో వందల కోట్ల లాభాలు వస్తున్నా యాజమాన్యం ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి ఎందుకు వెనకాడుతుందో అర్థం కావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రిఫ‌రల్ రూపంలో కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఏటా కోట్ల రూపాయలు చెల్లిస్తోంద‌ని, సింగ‌రేణి ఆసుప‌త్రిలో మాత్రం క‌నీస మౌలిక వ‌స‌తుల ఏర్పాటు విష‌యంలో ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కార్మికుల ఓట్ల‌తో గెలిచి, వారి సమస్యలను పరిష్కరించాల్సిన TBGKS పైరవీలు, ఫ్రీ మాస్టర్లు, పదవులకు ఆశపడి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణి హాస్పిటళ్ల‌ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లుగా నిర్మించాల‌ని డిమాండ్ చేశారు. HMS యూనియ‌న్ బెల్లంప‌ల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు ప‌తెం రాజ‌బాబు, ప్ర‌ధానకార్య‌ద‌ర్శి M. శివారెడ్డి ఆధ్వర్యంలో ఈ విజ్ఞాప‌న అందించారు. కార్య‌క్ర‌మంలో HMS కొమురంభీం జిల్లా అధ్యక్షుడు ఎండీ.గౌస్, బెల్లంపల్లి ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్‌కే.ఇనూస్, వర్కషాప్ ఫిట్ సెక్రటరీ ఎండీ.వశీమ్, S&PC ఫిట్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్, సింగరేణి గోలేటి డిస్పెన్సరీ ఇన్‌చార్జీ ఆర్‌.శ్రీనివాస్, శాంతిఖని ఫిట్ సెక్రెటరీ జీ.తిరుపతి, ఆర్గనైజ‌ర్లు సీహెచ్‌.మహేశ్, పెండ్యం శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like