క‌డెం క‌ష్టాలు తీరిన‌ట్టే…

-యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నులు చేస్తున్న అధికారులు
-పూర్త‌వుతున్న గేట్ల మ‌ర‌మ్మ‌తు ప‌నులు
-కడెంలో పెరుగుతున్న నీటిమట్టం
-కాలువలకు చిన్న‌,చిన్న మ‌ర‌మ‌త్తులు
-రైతులు చిగురిస్తున్న ఆశ‌లు

కడెం ప్రాజెక్టు గేట్ల మ‌ర‌మ్మ‌తు ప‌నులు చ‌క‌చ‌కా సాగుతుండ‌టంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అనుకోని విధంగా వ‌చ్చి ప‌డిన భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్రాజెక్టు భ‌విష్య‌త్తే ప్ర‌మాదంలో ప‌డింది. ప్రాజెక్టుకు ముప్పు త‌ప్పినా, గేట్లు పూర్తి స్థాయిలో దెబ్బ‌తిన్నాయి. దీంతో వచ్చిన వ‌ర‌ద వ‌చ్చిన‌ట్లు బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ప్రాజెక్టుతో పాటు, కొన్ని చోట్ల కాల్వ‌లు సైతం దెబ్బ‌తిన్నాయి. ఈ నేప‌థ్యంలోనే అధికారులు కొద్ది రోజులుగా యుద్ధ‌ప్రాతిపదిక‌న ప‌నులు చేస్తున్నారు.

క‌డెం వ‌ర‌ద గేట్లు కింద‌కు దిగుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. భారీ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ప్రాజెక్ట్ వరద గేట్లలో చెత్త చెదారం.. మోటార్లు పాడవడం, ఎలక్ట్రికల్ వ్యవస్థ దెబ్బతినడం. ప్రాజెక్ట్ 2, 3 నంబర్ కౌంటర్ వెయిట్లు కొట్టుకు పోవడంతో వరదగేట్లు పనిచేయని దుస్థితి. అప్రమత్తమైన అధికార యంత్రాంగం మరమ్మతు పనులను వేగవంతం చేసింది. భారీ వరదలతో ప్రాజెక్ట్ దెబ్బతినడంతో నీటి పారుదల శాఖ అధికారులు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతు పనులను పూర్తి చేస్తున్నారు. ఒక్కో గేటును పరిశీలించి వర దతో కొట్టుకువచ్చి అడ్డుగా నిలిచిన మొద్దులు, కొమ్మలు, మట్టిని తొలగిస్తు న్నారు. ఒక్కో గేటును పూర్తిగా రబ్బరు సీళ్లపై కూర్చునేలా ఏర్పాట్లు చేస్తు ఉన్నారు. పనుల్లో పురోగతితో పరదగేట్లు అన్ని కిందకు దిగాయి. దీంతో ప్రాజెక్ట్ లోకి ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో ఖాళీ అయిన కడెం నీటితో కళకళలాడుతోంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భారీ వరదలకు కడెం ప్రాజెక్ట్ దెబ్బతినడంతో ఆయకట్టు రైతాంగం వానాకాలం పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. సాగునీటి విడుదల ఉంటుందా? లేదా అని స్పష్టత లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. వరద గేట్లు కిందకు దిగడం, ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతుండడంతో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడెం జలాశయం కింద సుమారు 65 వేల ఎకరాల్లో పంటసాగవుతుంది. కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల వరకున్న ఆయకట్టు రైతులు కడెం మొన్నటి వరదలకు దెబ్బతినడంతో ఆందోళనకు గురయ్యారు. ఇది వరకే నారు పోసుకున్నవారు దాన్ని కాపాడుకుంటుండగా.. నాలుగైదు రోజులుగా రైతులు మొలకనారు, బురదనారు పోసుకుంటు పంటసాగుకు సిద్ధం అవు తున్నారు. పూర్తిస్థాయి నీటినిల్వ సామ ర్థ్యం 700 అడుగులు కాగా 685.6 ఆడు గులకు చేరుకోవడంతో ఇక పంటకు నీరే స్తారనే నమ్మకం రైతుల్లో పెరుగుతోంది.

అయితే, దెబ్బతిన్న కడెం ప్రధానకాలువను ఇంకా మెరుగుపర్చలేదు. చిన్నపాటి గండ్లు, అక్కడ క్కడ తూములవద్ద మరమ్మతు చేయాల్సి ఉంది. వాటి మరమ్మతు త్వరగా చేపడితే కాలువలకు నీరిచ్చేందుకు ఆటంకం తొలగిపోతుంది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి నీరిచ్చే ఏర్పాట్లుచే యాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. మ‌రోవైపు భవిష్యత్తులో ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు రాకుండా డ్యాం పునరా ప్రకృతి పైనా నీటిపారుదల శాఖ అధ్యయనం చేస్తోంది. గేట్ల సంఖ్యను పెంచడం, స్పిల్‌వే విస్తరించడం తో పాటు ఆనకట్టను పటిష్టం చేయ‌డంపై అధికారులు ప‌రిశీలిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like