ఆ గ‌నులు క‌ల్వ‌కుంట్ల కుటుంబ స‌భ్యుల‌కు..

-అందుకే సింగ‌రేణిని వేలంలో పాల్గొన‌కుండా చేస్తున్న‌రు
-ప్రైవేటీక‌ర‌ణ‌పై టీఆర్ఎస్‌, టీబీజీకేఎస్ త‌ప్పుడు ప్ర‌చారం
-ఆ నేత‌లు బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా..?
-బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు వెర‌బెల్లి ర‌ఘునాథ్‌

BMS Gate Meeting: దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న బొగ్గు గ‌నుల వేలం పాట‌లో సింగ‌రేణి పాల్గొన‌కుండా చేసి వాటిని క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి అప్ప‌గించే కుట్ర జ‌రుగుతోంద‌ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు వెర‌బెల్లి ర‌ఘునాథ్ దుయ్య‌బ‌ట్టారు. కావాల‌నే సింగ‌రేణి వేలంలో పాల్గొన‌కుండా చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న శుక్ర‌వారం శ్రీరాంపూర్ ఏరియా SRP-3 గనిపై BMS ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఇత‌ర రాష్ట్రల్లో బొగ్గు గనుల వేలంలో పాల్గొంటున్న సింగ‌రేణి సంస్థ మ‌న రాష్ట్రంలో ఎందుకు పాల్గొన‌డం లేదో ఆలోచించాల‌ని కార్మికుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అలా పాల్గొన‌కుండా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌న్నారు.

వేల కోట్ల ఆదాయం ఉన్న సింగరేణిని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అప్పులమయంగా మార్చిందన్నారు. ప్రైవేటీకరణపై టీఆర్ఎస్, టీబీజీకేస్ నేత‌లు కార్మికులను తప్పు దోవ పట్టిస్తున్నార‌ని, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పై తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్, టీబీజీకేస్ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా..? అని ప్ర‌శ్నించారు. సింగరేణి DMFT, CSR నిధులు ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఇతర జిల్లాకు తరలించడంతో సింగరేణి సంస్థ ఉన్న జిల్లాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కార్య‌క్ర‌మంలో BMS నాయకులు పేరం రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆగల్ డ్యూటీ రాజు, కదాసు భీమయ్య, సత్రం రమేష్, ఈర్ల సదానందం, మిట్టపల్లి మొగిలి, బరుపటి మారుతి, బుద్దే రాజన్న, తరాల విజయ్, మాడిషెట్టి మహేష్, కున రాయమల్లు, ఏర్శవెల్లి రవీందర్, శనిగరపు రాజాలింగు, కామరాజు, వినోద్, సందీప్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like