కరీంనగర్ లో నలుగురు మహిళలు మృతి

కరీంనగర్‌//: కరీంనగర్‌ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.వేగంగా దూసుకొచ్చిన కారు పట్టణంలోని కమాన్‌ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది.

దీంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులను ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.కారు వదిలి నలుగురు యువకులు పరారయ్యారు .కారు నెంబర్ Ts02 EY 2121. ఆ కారుపై నాలుగు చాలాన్లు ఉన్నాయని, అన్నీ ఓవర్‌స్పీడ్‌కు చెందనవేనని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like