కేసీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

బీజేపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీ నుంచి నిర‌వ‌ధికంగా స‌స్పెండ్ చేయ‌డం స‌రికాదని, ప్ర‌భుత్వ మొండి వైఖ‌రిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కేసీఆర్‌ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఫల్యాలు, టిఆర్ఎస్ అక్రమాలను ఎండ‌గ‌డ‌తార‌ని భ‌యంతో ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేశార‌ని అన్నారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయ‌డం స‌రికాద‌న‌నారు. ఇది మహిళ గవర్నర్ ను అవమానించడమే అన్నారు. కేసిఅర్ అరాచక పాలనకు రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్పి ప్ర‌జ‌లు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని అన్నారు. బీజేపీ నాయకులు దిష్టి బొమ్మ దహనం చేస్తున్న స‌మ‌యంలో పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. కొద్దిసేపు బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జ‌రిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, గాజుల ప్రభాకర్, బియ్యాల సతీష్ రావు, మల్యాల శ్రీనివాస్, ఆకుల అశోక్ వర్ధన్, ఆకుల సంతోష్, సోమ ప్రదీప్ చంద్ర, రాచకొండ సత్యనారాయణ, బల్ల రమేష్, ముదాం మల్లేష్, అమిరిషెట్టీ రాజు, కుదురుపాక గంగన్న, బొడకుంట ప్రభ, బోయిని లలిత, కుచాడి సతీష్, బల్ల రమేష్, అవిడపు రాజబాబు, నాగుల రాజన్న, తాటిపల్లి అంజన్, మీన సూరి, గంగాధర్, తన్నీరు కృష్ణ, సాతినీ రాజు, సింగరవెని శివ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like