కార్మికుల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్న కేసీఆర్

Singareni: ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు సింగ‌రేణి అంటే ఎన‌లేని ప్రేమ అని, ఆయ‌న కార్మికులను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటార‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం (TBGKS) శ్రీరాంపూర్ ఉపాధ్య‌క్షుడు సురేందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కార్మికుల‌కు లాభాల్లో వాటాగా 32% అందిస్తున్న సంద‌ర్భంగా శ్రీరాంపూర్లో ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కార్మికుల గురించి నిత్యం ఆలోచిస్తున్న ముఖ్య‌మంత్రికి కార్మికుల త‌ర‌ఫున శ్రీ‌రాంపూర్ బ్రాంచి క‌మిటీ త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నామ‌ని అన్నారు. కేసీఆర్ అడగకముందే అన్ని వరాలు ఇస్తున్నారని తెలిపారు. కోల్ ఇండియాలో లేని వాటిని కూడా ముఖ్య‌మంత్రి ఇక్క‌డ అమ‌లు చేస్తున్నార‌ని గుర్తు చేశారు. కేసీఆర్ వెంటనే కార్మికులు ఉంటారని స్ప‌ష్టం చేశారు. కార్యక్రమంలో ఏరియా జీఎం చర్చల క‌మిటీ ప్ర‌తినిధి వెంగల కుమారస్వామి, బ్రాంచ్ సెక్రటరీలు పానుగంటి సత్తయ్య, భూపతి అశోక్, కానుగంటి చంద్రయ్య, మహిపాల్ రెడ్డి, చీప్ ఆర్గనైజ్ సెక్రటరీలు జగదీశ్వర్ రెడ్డి, తొంగల రమేష్, శ్రీనివాస్ యాదవ్, నీలం సదయ్య, పొగాకు రమేష్, పిట్ సెక్రెటరీలు మహేందర్ రెడ్డి, మెండ వెంకటి, వెంకటేశ్వరరావు, ఇప్ప భూమయ్య, జంపయ్య, ఒల్లాల రవి, మహేష్ రాజ్, ఉత్తేజ్ రెడ్డి, ప్రసాద్, కాల్వ శ్రీను, శంకరయ్య, తిరుపతి రావు, సంతోష్, వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like