ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన

ఎల్లుండి వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన - పలు అభివృద్ధి పనుల పై సమీక్ష - హన్మకొండ పార్టీ కార్యాలయం ప్రారంభం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 10న పర్యటన చేపట్టనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్లు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్ హన్మకొండ జంటనగరాల రవాణా, అభివృద్ధి కి అవరోధంగా వున్న రైల్వే ట్రాక్ ల మీద రైల్వే వోవర్ బ్రిడ్జి ( ఆర్ వో బి) ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షజరిపి, సిఎం కెసిఆర్ మంజూరు చేయన్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై., వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనుల పురోగతి అంశాలను సిఎం సమీక్షించనున్నారు. హన్మకొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ అదే రోజు ప్రారంభించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like