నో అపాయింట్‌మెంట్‌..

ఢిల్లీలో మూడోరోజు కేసీఆర్ పర్యటన - ఇంకా లభించని మోదీ, మంత్రుల అపాయింట్‌మెంట్ - నేడో, రేపో వస్తుందంటున్న టీఆర్ఎస్ నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులు, అధికారులతో ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోసం సోమవారం ప్రయత్నించగా బిజీగా ఉండటంతో ఎవ‌రి అపాయింట్‌మెంట్ దొర‌క‌లేదు. దీంతో కేసీఆర్ తుగ్లక్ రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసంలో సోమవారం విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం సైతం ప్రధాని మోదీ, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ల అపాయింట్‌మెంట్‌ను సీఎంవో వర్గాలు కోరినా దీనిపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రధాని, కేంద్రమంత్రులను కలిసిగానీ తిరిగి హైదరాబాద్‌కు వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే ప్రధాని, కేంద్ర మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని.. నేడో, రేపో కచ్చితంగా అపాయింట్‌మెంట్ వస్తుందని గులాబీ నేతలు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like