కోడలి సజీవ దహనం కేసులో సిరిసిల్ల రాజ‌య్యకు ఊరట..

కోడ‌లి స‌జీవ ద‌హ‌నం కేసులో వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఊర‌ట ల‌భించింది. హైదరాబాద్ స్పెషల్ కోర్టులో రాజయ్యతో సహా నిందితులుగా ఉన్న ఆయన కొడుకు భార్యలను కూడా కోర్టు నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ, సిరిసిల్ల రాజయ్య ఇంటిలో 2015 నవంబర్ 4 తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు అభినవ్(7), ఆయోన్(3), శ్రీయోన్(3) సజీవ దహనమయ్యారు. రాజయ్యతో వరంగల్ లోని ఒకే ఇంటిలో రాజయ్య తన భార్యతో సహా కొడుకు, కోడలు, ముగ్గురు మనవలతో కలిసి ఓకే ఇంట్లో కలిసి ఉండేవారు.. ఈ ఇంటిలోనే అగ్ని ప్రమాదం సంభవించింది.

ఈ అగ్ని ప్రమాదంలో కోడలు సహా వారి ముగ్గురు మనవలు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రాజయ్య సహా ఆయన భార్యను, కొడుకును అదుపులోకి తీసుకొని 498ఎ, 306, 176 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. సారికను, పిల్లలను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారన్న బంధువుల ఫిర్యాదుతో పోలీసులు రాజయ్యపై అప్పుడు 302 సెక్షన్ కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసులో సిరిసిల్ల రాజయ్యకు ఊరట లభించింది.. ఆయన పైనా నమోదైన హత్య యత్నం కేసులో నాంపల్లి కోర్టు ఈరోజు ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ రెండో నిందితుడిగా మాజీ ఎంపీ రాజయ్య మూడవ నిందితురాలిగా రాజయ్య భార్య మాధవి పై కేసు నమోదైంది. ఈరోజు నాంపల్లి కోర్టు ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like