శ‌భాష్ కోనంపేట‌

-ఓటర్, ఆధార్ అనుసంధానం 100 శాతం పూర్తి చేసిన మొదటి పోలింగ్ కేంద్రం
-బూత్ స్థాయి అధికారిని స‌న్మానించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Manchiryal: ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంలో నెన్నెల మండలం కోనంపేట పోలింగ్ కేంద్రం రాష్ట్రంలోనే మొదటిసారి 100 శాతం పూర్తి చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ బాదావ‌త్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలదేవితో కలిసి కోనంపేట పోలింగ్ కేంద్రం బూత్ స్థాయి అధికారి కంకణాల సుమతిని శాలువాతో సన్మానించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు 10 వేల రూపాయల బహుమానం, ప్రశంసాపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో మాత్రమే 100 శాతం పూర్తి చేశార‌ని స్ప‌ష్టం చేశారు. వీటిలో జిల్లాలోని కోనంపేట పోలింగ్ కేంద్రం ఉండడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే స్పూర్తితో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డి.టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like