కొండ‌గ‌ట్టు ఆల‌యంలో భ‌క్తుల కిట‌కిట‌

జగిత్యాల : పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రం రామనామ జపంతో భక్త జనసంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూల నుంచి దీక్షాపరులు తరలి వచ్చి అంజన్న చెంతన దీక్షా విరమణ చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి మొదలైన భక్తుల తాకిడి ఇంకా కొనసాగుతోంది. ఆలయ పూజారులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరుముడితో పాదయాత్రగా వస్తున్న దీక్షాపరులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వాయుపుత్రుడు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హనుమన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులతో ఆంజనేయుని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like