ఫ్లాష్‌… ఫ్లాష్‌.. కోయ‌గూడెం బొగ్గు బ్లాక్‌ ఆరా కంపెనీకి కేటాయింపు

మంచిర్యాల : సింగ‌రేణి ప్రాంతంలో వేలం వేయాల‌నుకున్న నాలుగు బొగ్గు బ్లాక్‌ల్లో ఒక బొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు కంపెనీకి కేటాయిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఇల్లందులోని కోయ‌గూడెం బొగ్గు బ్లాక్‌ను ఆరా కంపెనీకి కేటాయించారు. అర‌బిందో ఫార్మ‌సీ కంపెనీకి చెందిన ఈ కంపెనీ బొగ్గు బ్లాక్ ద‌క్కించుకుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన సత్తుపల్లి బ్లాకు-3, కోయగూడెం బ్లాక్-3, శ్రావణపల్లి-3, కేకే-6 గనులను కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటించిన విష‌యం తెలిసిందే. గతంలో నిర్వహించిన టెండర్లలో కేవలం కోయగూడెం ఓసీపీ-3కి ఒకే ఒక టెండరు నమోదైంది. సింగిల్ టెండర్‌ అనుమతించే అవకాశం లేద‌ని అంతా భావించారు. తమకే వస్తాయన్న నమ్మకంతో సింగరేణి ధీమాతో ఉంది. కానీ ఆ బొగ్గు బ్లాక్‌ను మాత్రం ఆరా కంపెనీకి కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like