కుట్రకు సూత్రధారులు వీరే..

- ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వాకుల సహకారం -పోలీసుల అదుపులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు -మరిన్ని కీలక ఆధారాలు లభ్యం

ఉద్యోగాలు రావని, అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందని విద్యార్థులను రెచ్చగొట్టారు. ఆందోళన చేస్తున్న వారికి ఫులిహోర,బట్టర్ మిల్క్,వాటర్ బాటిళ్లు అందించారు. షెల్టర్లు కూడా కల్పించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం వెనక కుట్ర ఉందనడానికి ఆధారాలు లభ్యం అయ్యాయి. ఈ మేరకు పోలీసులకు పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చినట్లు సమాచారం. ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే ఈ విధ్వసం వెనక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగిందని తేల్చారు. పలువురు ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పాత్ర పై దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో నర్సారావు పేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రధాన పాత్ర ధారిగా తేల్చారు.

అభ్యర్థులను రెచ్చగొట్టడమే కాకుండా సుబ్బారావు ఆధ్వర్యంలోనే నిరసనకారులు రైల్వేస్టేషన్ వచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. కొన్ని అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులు షల్టర్ ఇచ్చినట్లు తేల్చారు.

ఆంధ్ర, తెలంగాణకు చెందిన పది ప్రైవేటు ఆర్మీ కోచింగ్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకున్న నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు తేలింది. ఆర్మీ రాత పరీక్ష రద్దు అయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే ఈ కుట్రకు ప్లాన్ జరిగిందని సమాచారం. విద్యార్థులను రెచ్చగొట్టిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like