లంచం తీసుకుంటుగా ముగ్గురి అరెస్ట్

లంచం తీసుకుంటుగా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్​ సంపత్​, సీనియర్​ అసిస్టెంట్​ అజీమోద్దిన్​, ప్రైవేట్​ అసిస్టెంట్​ లింగస్వామిలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. కరీంనగర్​ ఏసీబీ డీఎస్సీ భద్రయ్య ఆధ్వర్యంలో అంతర్గాం తహసీల్దార్​ కార్యాలయంలోనే పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. అంతర్గాం మండంలోని భూమిసర్వే చేయడానికి ఒక వ్యక్తి దగ్గర రూ. 2లక్షలు డిమాండ్​ చేశారు. మండల సర్వేయర్ కు సర్వే కోసం మోమో ఇవ్వడానికి లంచం డిమాంగ్​ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం డబ్బులు ప్రైవేట్​గా పెట్టుకున్న వ్యక్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీనియర్​ అసిస్టెంట్​ అజీమోద్దీన్ సెలవులో ఉండగా ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్​ కలెక్టరేట్ మీటింగ్​లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. వీరిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like