డ్రగ్స్ సరఫరాలో స్మగ్లర్ల కొత్త ఎత్తులు
ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి స్మగ్లింగ్ - రూ. 5.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం - మరో చోట యాప్ ద్వారా డ్రగ్స్ అమ్మకాలు
నాంది బ్యూరో
డ్రగ్స్ దందాలో స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అధికారుల కండ్లు కప్పి వాటిని సరఫరా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వాటిని పార్సిళ్ల ద్వారా పంపుతున్న అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను హైదరాబాద్ పోలీసుల అరెస్టు చేశారు. డీఆర్ఐతో పాటు నార్త్ జోన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఈ ముఠా గుట్టురట్టు చేశారు. కొందరు వ్యక్తులు ఫోటోఫ్రేమ్స్ లో పెట్టి నిషేధిత డ్రగ్స్ ఇంటర్నేషన్ కొరియర్ ద్వారా ఆస్ట్రేలియా కు తరలిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా జరుగుతోంది. బేగంపేట్ లో పార్సిళ్ల అంతరాష్ట్ర డ్రగ్ ముఠా వీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ , చెన్నై, బెంగళూర్ ద్వారా ఈ డ్రగ్స్ ను తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 22 ఫోటో ఫ్రెమ్స్ ను స్వాధీనం చేసుకున్నామని, ఈ ముఠా నుండి 14.2 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ నిషేధిత డ్రగ్ కిలో40 లక్షలు విలువ చేస్తుందని, మొత్తం 5.5 కోట్లు విలువైన ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠా 15 కేసుల్లో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. 300 కిలోల ఈ నిషేధిత ఎఫెడ్రిన్ డ్రగ్స్ ను తరలించారని, మరో ఇద్దరు నిందితులు పరారీ లో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని స్పష్టం చేశారు.
మరో చోట యాప్ ద్వారా అమ్మకాలు..
హైదరాబాద్‌లోని మెహిదిపట్నం బస్టాండ్‌లో పిల్స్ రూపంలో అమ్ముతున్న డ్రగ్స్ పట్టుకున్నట్లు వెస్ట్ జోన్ జాయింట్ సిపి ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఆసీఫ్ నగర్ లో MDMA డ్రగ్స్ పిల్స్ అమ్ముతున్నారని, ఈ డ్రగ్స్ నిషేధించారని ఆయన వెల్లడించారు. మెహిదీ పట్నం బస్టాండ్ లో అమ్మకాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని, మూడు లక్షలు విలువైన డ్రగ్స్ మాత్రలు ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్కొక్క పిల్ 2500 రూపాయలు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. సాయి చరణ్, అంకిత్, ఢిల్లీ కి చెందిన అజయ్ సాయిని అరెస్ట్ చేశామన్నారు. ఒక యాప్ ద్వారా ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్నారని వెల్లడించారు. విద్యార్థులకు ఈ ముగ్గురు కూడా ఈ డ్రగ్స్ పిల్స్ అమ్ముతున్నారని చెప్పారు.