భైంసాలో కత్తిపోట్ల కలకలం

Bhainsa:నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఓ యువకుడిపై కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. భైంసా పట్టణంలోని గోపాల్ నగర్ చెందిన తోట శంకర్ (30)పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వేళ వచ్చిన ఆ వ్యక్తి శంకర్ ను బయటకు పిలిచిచాడు. ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చిన శంకర్ పై ఆ వ్యక్తి కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డట్లుగా తెలిసింది.
బాధితుడు కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు వచ్చారు. దీంతో దాడికి పాల్పడ్డ వ్యక్తి తాను తీసుకువచ్చిన బైక్ అక్కడే వదిలి పారిపోయాడు. గాయాలపాలైన శంకర్ ను కాలనీకి వాసులు ఏరియా అసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.