హాలీవుడ్ హీరోలా కేటీఆర్
KTR: ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. దీనిని ఉపయోగించుకుని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని దీని ద్వారా మంత్రి కేటీఆర్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది కేటీఆర్ జన్మదినం సందర్భంగా తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటూ విష్ చేస్తున్నారు. మరికొందరు సాధారణంగా కాకుండా.. వినూత్నంగా తమ అభిమానాన్ని తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వీరాభిమాని కేటీఆర్ సూపర్ హీరోగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఫొటోలు డిజైన్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా జల్లి అశోక్ వర్మ అనే ఓ డిజైనర్ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. రాష్ట్రానికి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ అంతర్జాతీయ కంపెనీలకు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చిన కేటీఆర్‌ను సూపర్ మ్యాన్‌తో పోలుస్తూ ఏఐ ద్వారా ఫొటోలు డిజైన్ చేశాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో కేసీఆర్ యంగ్ లుక్‌తో హాలీవుడ్ సినిమాల్లో హీరోలా ఉన్నారు.