అధికారులపై చర్యలు తీసుకోండి

BMS: సింగరేణి RG-3 అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గని ప్రమాదంలో మల్టీ జాబ్ వర్క్ మెన్ కార్మికుడు మృతి చెందడం శోచనీమయని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ABKMS-BMS) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు మాదాసు రవీందర్, ఏరియా ఉపాధ్యక్షుడు, అరుకాల ప్రసాద్, కార్యదర్శి మామిడి స్వామి ALP పిట్ కార్యదర్శి రామంచ సంపత్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే గోదావరి ఖని ఏరియా ఆసుపత్రికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరు తెలుసుకున్నారు. కార్మికుడు బోర్ల సారయ్య కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాల మీద ఉండటం లేదని దుయ్యబట్టారు. ప్రమాదానికి బాధ్యులైన అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.