ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరద నీరు

Floods:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈరోజు కురిసిన భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లోని పలు వార్డులోకి వరద నీరు చేరింది. బ్లడ్ బ్యాంక్, గర్భిణీ వార్డు, చిల్డ్రన్స్ వార్డు వరద నీరు చేరడంతో రోగులు వారి బంధువులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వాసుపత్రిలోకి వరద నీరు చేరడంతో జిల్లా కలెక్టర్ సంతోష్ హాస్పటల్ సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి హాస్పిటల్ లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.