ఆగస్టు 3 నుంచి శాసనసభ సమావేశాలు
Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 3 నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండగా..అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. కాగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజుల పటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఇటీవల రాష్ట్రాన్ని వరదలు కుదిపేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా మారనుంది. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు తమ గొంతును వినిపించే అవకాశాలున్నాయి.