నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్‌

నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాండూర్ సీఐ దేవయ్య వెల్లడించారు. తాండూర్ మండలం అచలాపూర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్‌ నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 40 బైక్‌లను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు నేరస్తులు, షెల్టర్‌ తీసుకొని ఉంటే వెంటనే సమాచారం అందించాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్‌ నేరగాళ్ల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌, వాట్సాప్‌ కాల్స్‌లకు స్పందింరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా సీటు బెల్టు విధిగా ధరించాలన్నారు.

గ్రామాల్లో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో తాండూర్ ఎస్‌ఐ ప్రసాద్, ఎస్‌ఐ సౌజన్య (మాదారం), ఎస్‌ఐ కోటేశ్వర్ (భీమిని), ఎస్‌ఐ భాస్కర్ రావు (కన్నేపల్లి), సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like