టిప్రుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Basara IIIT:బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ చెందిన జాదవ్ బబ్లూ అనే విద్యార్థి పీయూసీ-మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జాదవ్ సోదరుడు కూడా అదే ట్రిపుల్ ఐటిలో చదువుతున్నాడు. తన సోదరుడితో మధ్యాహ్నం వరకు మాట్లాడిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు బబ్లూ భౌతికకాయాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. బబ్లూ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు చెబుతున్నారు. విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.